హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జైల్‌లో కుమారుడు.. తల్లి తీవ్ర నిర్ణయం!

GNTR: ఫిరంగిపురం గొల్లపాలెం గ్రామానికి చెందిన దార్ల ఆనందకుమారి బుధవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివాదంలో చిక్కుకున్న ఆమె కుమారులు గోపి, రాజాలకు కోర్టులో బెయిల్ రాకపోవడం, ప్రత్యర్థులు ఇంటికి వచ్చి బెయిల్ రాకుండా చేస్తాం అని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆమె అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.