హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవ్వితే కేసులు పెడతారు: అనిల్

నెల్లూరు: టెండర్ల కోసం సీఎం చంద్రబాబు వద్ద వేమిరెడ్డి దంపతులు దండాలు పెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తోందని ఆరోపించారు. వేమిరెడ్డి రూ.20 కోట్లు సాయం చేసి రూ.100 కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. నవ్వితే కూడా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.