W.G: చంద్రబాబు అరెస్టు అన్యాయమని ప్రజలు ఆనాడే తిరస్కరించారని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. పెనుగొండలో నిర్వహించిన 'నిజం గెలిచింది' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం లేని కేసును సృష్టించి చంద్రబాబును 53 రోజులు జైలులో ఉంచిందని ఆరోపించారు. 2024లో ప్రజలు కూటమికి పట్టం కట్టారని, అభివృద్ధి, సంక్షేమం కొనసాగేందుకు 2029లోనూ మద్దతు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చంద్రబాబు అరెస్టును ఆనాడే తిరస్కరించారు'


