హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ మేయర్‌ అభ్యర్థి ఎవరు..!

NTR: విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా తన కుమారుడు బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలని సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మంత్రి నారా లోకేశ్‌ను కోరారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్‌ను ఉమా, సిద్ధార్థ కలిశారు. కాపు సామాజికవర్గానికి అవకాశం కల్పించాలన్న అంశాన్ని ప్రస్తావించారు. అవకాశం ఇస్తే గెలుపు ఖాయమని తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఉమా వెల్లడించారు.