TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, బయట బాటగంగమ్మ ఆలయం వరకు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 77,670 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 33,904 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గురువారం: నేటి తిరుమల సమాచారం


