NTR: మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 11న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. JKC, వికాస సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే మేళాలో 10 సంస్థలు పాల్గొంటాయని చెప్పారు. 10వ తరగతి నుంచి PG వరకు చదువుకున్న అభ్యర్థులు అర్హులని, రూ. 14 వేల నుంచి రూ. 50 వేల వరకు వేతన అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మైలవరంలో మెగా ఉద్యోగ మేళా


