హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల వినూత్న నిరసన!

బాపట్ల ఏరియా వైద్యశాలలోని DMHO ఆఫీస్ ఎదుట వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వినాలని, చూడాలని, స్పందించాలని కోరుతూ చెవులు, కళ్ళు, నోరు మూసుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు జేఏసీ నేత సత్యం రాజు తెలిపారు.