హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ భరోసా దరఖాస్తుల వెల్లువ..!

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే ఆరు మండలాల్లో 2,030 దరఖాస్తులు వచ్చినట్లు అవనిగడ్డ ఎంపీడీవో ఎం.వనజ తెలిపారు. అవనిగడ్డ 226, కోడూరు 238, మోపిదేవి 400, నాగాయలంక 361, ఘంటసాల 403, చల్లపల్లి 402 దరఖాస్తులు నమోదయ్యాయని పేర్కొన్నారు.