SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ స్కిల్ హబ్ సెంటర్‌లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ కోర్సుకు పదో తరగతి, కంప్యూటర్ MS ఆఫీస్ కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణత అర్హతగా పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు, ఈనెల 15 లోపు సర్టిఫికెట్లతో నమోదు చేసుకోవాలి అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం


