హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వర్టుపై పెద్ద గుంత.. ఇబ్బందుల్లో వాహనదారులు

SRPT: జాజిరెడ్డిగూడెం గ్రామంలోని వడ్డెర కాలనీలో కల్వర్టుపై నుంచి మట్టి టిప్పర్లు రాకపోకలు సాగించడంతో కల్వర్టు పగిలి పెద్ద గుంత ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టుకు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు