హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: గూడూరు మండలంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం పలు గ్రామాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ జి.గోవిందరావు తెలిపారు. కప్పలదొడ్డి, కంకటావ, ఆకులమన్నాడు, నారికేడలపాలెం, లేళ్లగరువు, ఆర్వీపల్లి, గండ్రం, నాగవరం, పోలవరం, ఐదుగుళ్లపల్లి, రామన్న నేట గ్రామాల వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.