హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా

తూ.గో: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈనెల 11న హెటిరో లాబ్స్ ఉద్యోగాలకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్, జేకేసీ ఛైర్మన్ డాక్టర్ రామచంద్ర ఆర్కే తెలిపారు. బీఎస్సీ కెమిస్ట్రీ, బీఏ, బీకాం, బీఫార్మసీ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. 2022-2026 మధ్య డిగ్రీ పూర్తిచేసిన వారు విద్యార్హతలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.