హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికై ప్రత్యేక శిక్షణ

BPT: గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల తహసీల్దార్లకు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ, రెవెన్యూ సేవలపై గుంటూరులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రెవెన్యూ క్లినిక్‌ల నిర్వహణ, భూవివాదాలు, డీ-పట్టాలు, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. పీజీఆర్‌ఎస్ అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.