హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారుణ్య నియామకాలపై విచారణ..!

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సర్వీసులో ఉండగా మృతి చెందిన వర్కర్లు లాజర్, నరసింహులు వారసుల కారుణ్య నియామకాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అనంతపురం మున్సిపల్ RD విచారణ చేపట్టారు. బుధవారం మున్సిపల్ ఏసీ గౌడ్ సంబంధిత ఫైళ్లను ఆర్డీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది.దీనిపై ACని వివరణ కోరగా ఇతర సబ్జెక్ట్ ఫైళ్లను తీసుకెళ్లినట్లు తెలిపారు.