హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి'

BPT: బాపట్ల జిల్లాలో వెంటనే ఉపాధి హామీ పనులు ప్రారంభించి, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి టి.కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డ్వామా పీడీ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. పనులు లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బకాయిలు త్వరలోనే కూలీల ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తామని పీడీ హామీ ఇచ్చారు.