హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం'

KDP: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని కవి, రచయిత బొల్లు రామమోహన్ పిలుపునిచ్చారు. పోరుమామిళ్లలోని మట్టి విగ్రహాల తయారీ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలతో కాలుష్యాన్ని నివారించి భావితరాలకు స్వచ్ఛమైన భవిష్యత్ అందించవచ్చన్నారు. ప్రకృతిని ప్రేమించి కాపాడినప్పుడే భావితరాల భవిష్యత్‌ను రక్షించగలమన్నారు.