కాకినాడ: వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా వి. తారక రామారావు నియమితులయ్యారు. గతంలో కరప మండల ఏవోగా, కరప సబ్ డివిజన్ ఏడీగా, జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. కొంతకాలం ఆత్మ ప్రాజెక్టులోనూ సేవలందించారు. ఖాళీగా ఉన్న జిల్లా జేడీ పోస్టులో ఆయనను నియమించారు. వ్యవసాయశాఖపై పూర్తి పట్టు, అవగాహన ఉన్న అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది.
ఆంధ్రప్రదేశ్
వ్యవసాయశాఖ జేడీగా వి.తారక రామారావు నియామకం


