తూ.గో: కొవ్వూరు ఆర్టీసీ డిపో నుంచి 39 బస్సులు వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. బస్సుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ఇందులో భాగంగా నాలుగు నూతన బస్సులను గురువారం డిపోలో ప్రారంభించారు. మరో మూడు కొత్త బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
కొవ్వూరు ఆర్టీసీ డిపోకు 4 కొత్త బస్సులు: MLA ముప్పిడి


