SRD: న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్ అదాలత్‌ను సెప్టెంబర్ 12న సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్, జిన్నారం కోర్టుల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీ చంద్ర తెలిపారు. సివిల్, క్రిమినల్, చెకౌబౌన్స్, కుటుంబ, ప్రమాద పరిహారం తదితర రాజీ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్


