హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె నిద్రలో పలు అంశాలపై సీఐ హెచ్చరికలు

VZM: మత్తు పదార్థాల వినియోగం, విక్రయం,రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజాం రూరల్ CI ఉపేంద్ర హెచ్చరించారు. నిన్న రాత్రి స్దానిక తలాడ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు.