హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రౌన్ ఆఫ్ కాకినాడగా ట్రాన్స్‌జెండర్ ఐశ్వర్య

కాకినాడలో నిర్వహించిన అందాల పోటీల్లో ట్రాన్స్ జెండర్ ఐశ్వర్య 'క్రౌన్ ఆఫ్ కాకినాడ'గా, అమూల్య రన్నరప్‌గా నిలిచారు. 3 విభాగాల్లో పోటీలు నిర్వహించగా ట్రాన్స్ జెండర్ విభాగంలో వీరిద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం పలువురు ట్రాన్స్ జెండర్లు ఐశ్వర్య, అమూల్యను ఘనంగా సత్కరించారు.