హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి:ఎస్పీ

తూ.గో: కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులో చార్జిషీట్లను కోర్టులో దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సై, ఆపై స్థాయి అధికారులతో అర్ధవార్షిక నేర సమీక్ష నిర్వహించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు.