హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి మామిడి రైతుల జాబితా ప్రదర్శన

CTR: ప్రభుత్వ ప్రోత్సాహకానికి అర్హులైన తోతాపురి మామిడి రైతుల జాబితాను నేడు జిల్లాలోని 314 రైతుసేవా కేంద్రాల్లో ప్రచురించనున్నారు. జిల్లాలోని 28,246 మంది రైతులు సుమారు 3.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఈ ఏడాది పల్ప్ ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద విక్రయించారు. జాబితాను రైతులు పరిశీలించి అభ్యంతరాలపై గ్రామసభలలో ఫిర్యాదు చేయాలని అధికారులు చెప్పారు.