హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

GNTR: నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లింగాయపాలెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. చెరువు కట్టపై చెట్టు కింద పేకాట ఆడుతున్న12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.17,140 నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు ఎస్‌బీ, పోలీస్‌ సిబ్బంది సహకారంతో ఈ దాడి నిర్వహించారు.