హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: అచ్యుతాపురం మండలంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఈఈ రామకృష్ణ, ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. దిబ్బపాలెం సెజ్ కాలనీ, గొర్లెధర్మవరం, మెట్టధర్మవరం, లంకధర్మవరం, మార్టూరు, కుమారాపురం, జంగులూరు, దుప్పితూరు, వెంకటాపురం కూడలిలో మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు.