హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గడువులోగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరాలి'

ASR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎంపికైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు నిర్దేశిత గడువులోగా విధుల్లో చేరాలని డీఈవో భానుమూర్తి రాజు సూచించారు. ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లాకు 389 ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు 8 నెలల కాలపరిమితితో పని చేయాలని సూచించారు.