ASR: కౌమార బాలురలో జీవన నైపుణ్యాలు, ఆరోగ్యం, లింగ సమానత్వం, బాధ్యతాయుత ప్రవర్తనపై అవగాహన కల్పించేందుకు నోడల్ ఉపాధ్యాయులకు అరకులో నిన్న శిక్షణ నిర్వహించారు. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాలకు చెందిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు నిరంతరం అవగాహన కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్
కౌమార బాలుర సాధికారతకు ఉపాధ్యాయులకు శిక్షణ


