హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గవర్నర్‌ను కలిసిన జోగి కోడలు..!

NTR: విజయవాడలో ఏపీ గవర్నర్‌ను మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘన కలిశారు. భర్త జోగి రాజీవ్, అత్తమామలపై దాఖలు చేసిన గృహహింస, కట్నం వేధింపుల కేసుల పురోగతిపై వినతిపత్రం అందజేశారు. తనకు, కుటుంబానికి రక్షణ కల్పించి, చట్టపరంగా త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మేఘన వినతిపై రాజ్‌భవన్ సానుకూలంగా స్పందించింది.