హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ ఉత్సవాలకు మంత్రి సవితకు ఆహ్వానం

సత్యసాయి: మంత్రి సవితను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్, ప్రతినిధులు కలిశారు. విజయవాడ విద్యాధరపురంలో ఈ నెల 14 నుంచి జరిగే పంచముఖ వరసిద్ధి మహాగణపతి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలోనే భారీ ఎత్తున వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న డూండీ గణేశ్ సేవా సమితిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.