విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక ఫిర్యాదులు ఇవాళ, రేపు స్వీకరించనున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రణాళిక విభాగ అధికారులంతా అందుబాటులో ఉంటారని తెలిపారు. వినతులు సమర్పించే వారు సంబంధిత దస్త్రాలు తీసుకురావాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు ఫిర్యాదుల స్వీకరణ


