హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

కృష్ణా: పామర్రు మండలం కొమరవోలులో ఎస్సై శ్రీనివాసు ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల నివారణ, పోక్సో చట్టం, మైనర్ డ్రైవింగ్, బాల్య వివాహాలు, సైబర్ మోసాలపై ఆయన వివరించారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.