హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలకలపూడిలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

కృష్ణా: మచిలీపట్నం చిలకలపూడి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి పోలీసులు విస్తృతంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేని ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన తనిఖీలు చేపట్టి, నిబంధనలు పాటించని పలు వాహనాలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.