హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మెగా జాబ్ మేళా

SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.గోవిందమ్మ తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాకు 10 ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నాయి. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.