హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు రానున్న హక్కుల పరిరక్షణ సభ్యురాలు

కడప: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కె.జి. పద్మలత సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. బాలల హక్కుల చట్టాల అమలు, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. కడప, ఖాజీపేట, బద్వేల్, ప్రొద్దుటూరులో అంగన్‌వాడీలు, పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర సంస్థలను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.