హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు చోరీ కేసుల్లో ఐదుగురు అరెస్ట్..!

అన్నమయ్య: రాయచోటి మూడు వేర్వేరు చోరీ కేసుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామాపురం పరిధిలో రెండు కేసుల్లో నలుగురు, లక్కిరెడ్డిపల్లి పరిధిలో ఒక కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 7.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. నిందితులు ఇంటి దొంగలేనని వెల్లడించారు.