హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు వేగం

ELR: జిల్లాలో ఆరు చోట్ల ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటును వేగవంతం చేసినట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. సీఎస్ నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఏలూరు, చింతలపూడి, పోలవరం, కైకలూరులో పనులు తుది దశకు చేరాయని, దెందులూరు, నూజివీడులో ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.