హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రి 10 తర్వాత డీజేలు నిషేధం: ఎస్పీ

బాపట్ల జిల్లాలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఎస్పీ ఉమామహేశ్వర్ కీలక సూచనలు చేశారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు పోలీస్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు డీజేలకు అనుమతి ఉండదని హెచ్చరించారు.