హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆది వరాహ స్వామి హుండీ లెక్కింపు

PDPL: కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ ఆదివరాహస్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం కళ్యాణ మండపంలో నిర్వహించారు. దేవాదాయ శాఖ జిల్లా ఇంఛార్జ్ ప్రవీణ్, ఈవో కొసన కాంతారెడ్డి, చైర్మన్ ముస్యాల దామోదర్ ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. హుండీ ద్వారా రూ.6,53,959 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించినట్లు తెలిపారు.