హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హరిత టూరిజం హోటల్ ఏర్పాటు చేయండి'

MBNR: జడ్చర్లలో హరిత టూరిజం హోటల్ ఏర్పాటు చేయాలని జడ్చర్ల MLA జనంపల్లి అనిరుద్ రెడ్డి పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. బుధవారం ఈ విషయమై మంత్రికి వినతి పత్రం సమర్పించారు. జడ్చర్ల నేషనల్ హైవే 44 పై ఉన్న కారణంగా టూరిజం హోటల్ ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.