హైదరాబాద్: 28°C
వ్యాపారం

వర్క్‌ ఫ్రం హోం నిబంధనలు కఠినతరం

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ టెక్నాలజీస్ తమ వర్క్ ఫ్రమ్ హోం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. తమ సంస్థలో పని చేసే 1 శాతం మంది ఉద్యోగులకే పూర్తి స్థాయి వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. మిగిలిన ఉద్యోగులు వారానికి కనీసం 3 రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు హాజరుకావాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇందుకు వీలుగా ఉద్యోగులు రీలోకేట్ కావాలని తెలిపింది.