హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఉద్యోగ నియామకాలు.. భారత్ తొలిస్థానం

అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఉద్యోగ నియామకాల వృద్ధిలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మ్యాన్‌పవర్‌ గ్రూప్ సర్వే ప్రకారం 2026 4వ త్రైమాసికంలో నికర ఉద్యోగ నియామకాల ఉద్దేశం 54%గా నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 6% ఎక్కువ. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 65% వరకు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని భావిస్తుండగా, కేవలం 11% సంస్థలు మాత్రమే తగ్గింపును అంచనా వేశాయి.