ఉద్యోగ నియామకాల వృద్ధిలో HYD దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం, గతేడాది ఆగస్టుతో పోలిస్తే నగరంలో నియామకాలు 23% పెరిగాయి. దేశవ్యాప్తంగా వార్షిక ప్రాతిపదికన 14% వృద్ధి నమోదై సూచీ 3,028 పాయింట్లకు చేరింది. ఐటీ, ఐటీయేతర రంగాలలో ఈ వృద్ధి కనిపించింది. పండగల సీజన్ SEPకు మారడం కూడా దీనిపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు తెలిపారు.
వ్యాపారం
ఉద్యోగ నియామకాలు.. HYDలోనే నెంబర్ వన్


