హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారిపై కేసు

KKD: తుని పట్టణంలోని సీతారాంపురం జంక్షన్లో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారిపై మూడు కేసులు నమోదు చేశామని ఏఎస్సై మోహన్ రావు తెలిపారు. పాయకరావుపేట వైపు నుంచి జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో ఓ లారీ, రెండు వాహనాలు వస్తుండటంతో పట్టుకున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.