హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నమయ్య భవనం వద్ద జెర్రిపోతు పాము హల్‌చల్

TPT: తిరుమలలోని అన్నమయ్య భవనం వద్ద బుధవారం ఉదయం జెర్రిపోతు పాము హల్‌చల్ చేసింది. హఠాత్తుగా పాము కనిపించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలివేశారు. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.