హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరల పెరుగుదలపై సీపీఐ ధర్నా

VZM: బొబ్బిలి పట్టణం లోని బలిజిపేట రోడ్డు జంక్షన్ వద్ద నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కోట అప్పన్న, మునకాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్లాక్‌మార్కెట్, అక్రమ నిల్వలు, దళారీ దోపిడీని అరికట్టి ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.