హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ'

ASR: మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.సూర్యకుమారి ఇవాళ జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. హుకుంపేట మండలంలోని గడుగుపల్లి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న సేవలు, పోషకాహారం పరిశీలించారు. చిన్నారులతో ఆటలు ఆడుతూ పాటలు పాడారు. ఆహ్లాదకర వాతావరణంలో అభ్యసన, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.