హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి భద్రత పట్ల యువతకు అవగాహన

VZM: విజయనగరం ఆదిత్య కళాశాలలో ట్రాఫిక్ సిఐ ఎస్.రాము ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత తమ జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, బెట్టింగ్ యాప్‌లు, జూదానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.