ASR: పెదబయలు మండలంలో పెండింగ్‌లో ఉన్న నాన్-రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణ కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాబుజీ బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిలుములు, పెదగొంది, సావిడిమామిడి, మాలసీతకోట తదితర గ్రామాల్లో పెండింగ్ ఉన్నాయన్నారు. ఆయా గ్రామాల గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్‌లో ఉన్న NRSTC కేంద్రాలు ప్రారంభించాలి'


