హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దావగూడూరులో మాజీ MPTC మృతి

ప్రకాశం: జరుగుమల్లి(M), దావగూడూరు గ్రామంలో బుధవారం విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ,చెన్నకేశవ ఆలయ మాజీ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు జి.వరప్రసాదరావు అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఆయన మృతితో గ్రామ పార్టీ నాయకులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.