హైదరాబాద్: 28°C
తెలంగాణ

బల్దియా కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు

WGL: కాళోజీ నారాయణ రచనలను తెలంగాణ యువత స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని GWMC అడిషనల్ కమిషనర్ ఈసంపల్లి జోనా పిలుపునిచ్చారు. బల్దియా కార్యాలయంలో ఈరోజు జరిగిన కాళోజి నారాయణరావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బందితో కలిసి కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.